రామగుండం, 24 July
ముండంపలీకమిషనఅంబకిషఝఆశలమకు,మంచిలడీీపీభకపకషణల,బెలలంపలలిలనినతనతెచలబినులకుమహిళభతపైఅహనకలపించంుకుమంచిలజిలలషీీమఆధంలపతకకకమంనిహించు.ఈంభంషీీమలనుినించుకలనిపలీులుూచించు.
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు, మంచిర్యాల డీసీపీ భాస్కర్ పర్యవేక్షణలో, మంచిర్యాల జిల్లా షీ టీమ్ ఎస్ఐ. ఉషారాణి ఆధ్వర్యంలో మహిళా భద్రతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమం బెల్లంపల్లిలోని సనాతన తెచలాబ్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగినులకు ఏర్పాటు చేశారు.
షీ టీమ్ సిబ్బంది మహిళల కోసం అమలు చేస్తున్న భద్రతా చర్యలు, ఈవ్‌టీజింగ్, సైబర్ నేరాలు, మానవ అక్రమరవాణా, ట్రాఫిక్ నియమాలు, టి-సేఫ్ యాప్, షీ టీమ్స్ సేవల గురించి సమగ్రంగా వివరించారు. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచిస్తూ, హెల్ప్‌లైన్ నంబర్లు డయల్ 100, రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల జిల్లా షీ టీమ్ నంబర్ 8712659385లను తెలియజేశారు.
సమాచారం అందించిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడతాయని హామీ ఇచ్చారు. తెలంగాణ ప్రభుత్వం మహిళల భద్రతకు అత్యంత ప్రాధాన్యం ఇస్తూ రాష్ట్రవ్యాప్తంగా పటిష్ట చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. మహిళలు ఎటువంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే ఫిర్యాదు చేయాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు శ్రవణ్, శ్రీలత మరియు సనాతన తెచలాబ్స్ సాఫ్ట్వేర్ ఉద్యోగినులు పాల్గొన్నారు.











