డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్ (డీజేఎఫ్డబ్ల్యూ) ఆధ్వర్యంలో ఆదివారం పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలో నిర్వహించిన కార్యవర్గ సమావేశంలో జిల్లా కమిటీని ఎన్నుకుని పలు కీలక పదవులకు నియామకాలు చేపట్టారు.
సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు తంగలపల్లి అరుణ్‌కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు కోల శ్రీనివాస్, వర్కింగ్ ప్రెసిడెంట్ దార మధు సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో సంస్థ బలోపేతం, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, సంఘ విస్తరణ తదితర అంశాలపై చర్చించి పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
ఈ సందర్భంగా బూడిద రాజు జిల్లా అధ్యక్షుడిగా, బండం చంద్రశేఖర్ రెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శిగా, జోడు సురేష్ జిల్లా కార్యదర్శిగా నియమితులయ్యారు.
నూతనంగా బాధ్యతలు స్వీకరించిన వారు మాట్లాడుతూ, డెమోక్రటిక్ జర్నలిస్ట్ ఫెడరేషన్ వర్కింగ్‌ను జిల్లాలో మరింత బలోపేతం చేయడంతో పాటు జర్నలిస్టుల సంక్షేమం కోసం కృషి చేస్తామని తెలిపారు. సంస్థ లక్ష్యాల సాధనకు అందరూ సమిష్టిగా పనిచేయాలని వారు పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా పలువురు జర్నలిస్టులు, సంఘ సభ్యులు పాల్గొని నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.












