కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న "సఖి కేంద్రం"లో పలు ఖాళీలను అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయనున్నారు. ఈ మేరకు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు శాఖ ఒక ప్రకటన విడుదల చేసింది. అర్హులైన మహిళా అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరింది.
మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ కొమురంభీం ఆసిఫాబాద్, "సఖి కేంద్రం"లో సెంటర్ అడ్మినిస్ట్రేటర్ (మహిళా), పారా లీగల్ అడ్వైజర్, కేస్ వర్కర్ (మహిళా), ఐటీ అసిస్టెంట్ కామ్ అకౌంటెంట్, మల్టీ పర్పస్ వర్కర్ (మహిళా) పోస్టులను భర్తీ చేయనుంది. ఒక్కో పోస్టుకు ఒక్కరు చొప్పున మొత్తం 5 ఖాళీలు ఉన్నాయి.
సెంటర్ అడ్మినిస్ట్రేటర్ పోస్టుకు సోషల్ వర్క్/సోషియాలజీలో పీజీ, 5 ఏళ్ల అనుభవం, రూ.35,000/- వేతనం. పారా లీగల్ అడ్వైజర్ పోస్టుకు ఎల్ఎల్బీ/ఎల్ఎల్ఎం, 3 ఏళ్ల అనుభవం, రూ.25,000/- వేతనం. కేస్ వర్కర్ పోస్టుకు సోషల్ వర్క్/సోషియాలజీలో పీజీ, 3 ఏళ్ల అనుభవం, రూ.20,000/- వేతనం.
ఐటీ అసిస్టెంట్ కామ్ అకౌంటెంట్ పోస్టుకు బీ.కామ్ (కంప్యూటర్స్), 3 ఏళ్ల అనుభవం, కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి, రూ.20,000/- వేతనం. మల్టీ పర్పస్ వర్కర్ పోస్టుకు పదో తరగతి/ఇంటర్, కొంత అనుభవం, రూ.12,500/- వేతనం. ఈ పోస్టులన్నీ అవుట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేయబడతాయి.
ఆసక్తి గల అభ్యర్థులు తమ పూర్తి బయోడేటాతో పాటు అవసరమైన ధ్రువపత్రాలను జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, వికలాంగులు, ట్రాన్స్జెండర్ మరియు వయో వృద్ధుల సంక్షేమ శాఖ, సమీకృత జిల్లా అధికారుల భవనం, కొమురంభీం ఆసిఫాబాద్ చిరునామాలో మే 10, 2008 సాయంత్రం 4 గంటలలోపు అందజేయాలి. మరిన్ని వివరాలకు 9441433832 నంబర్లో సంప్రదించవచ్చు.











