మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 29
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం గ్రామంలో నిన్న సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. పలు కాలనీలలో రోడ్లపై నీరు నిలిచిపోవడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో, సర్పంచ్ విజయలక్ష్మి తక్షణమే స్పందించి, సిబ్బందితో కలిసి రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలోని భీమారం గ్రామం నిన్న సాయంత్రం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి అతలాకుతలమైంది. పలు కాలనీలలో రోడ్లు నీటమునిగాయి. ఈ పరిస్థితిని తెలుసుకున్న సర్పంచ్ విజయలక్ష్మి వెంటనే రంగంలోకి దిగారు. తన సిబ్బందితో కలిసి జేసీబీ సహాయంతో రోడ్లపై నిలిచిన నీటిని పక్కకు మళ్లించారు. కొన్ని ప్రాంతాలలో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో, నీటిని దారి మళ్లించడానికి జేసీబీతో ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
గతంలో ఎంతో మంది సర్పంచులు ఉన్నా, ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో తక్షణ స్పందన చూపిన సర్పంచ్‌ను చూడలేదని భీమారం ప్రజలు విజయలక్ష్మిని అభినందిస్తున్నారు. ఈ సందర్భంగా, గ్రామపంచాయతీ సిబ్బంది వర్షంలో తడిసి అనారోగ్యం పాలు కాకుండా వారికి రెయిన్కోట్లు పంపిణీ చేశారు.


