మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 13
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని మార్కెట్ రోడ్డులో రోడ్ల విస్తరణ పనుల్లో భాగంగా, మాన్యువల్స్ తేల్చి ఉంచడంతో, ఐరన్ స్టాండ్ తొలగించడంతో గురువారం ఒక కారు ప్రమాదానికి గురైంది. తేలి ఉన్న మ్యానువల్లోకి కారు అదుపుతప్పి దూసుకుపోవడంతో డ్యామేజ్ అయింది.

రోడ్ల మరమ్మత్తులు, ట్రాఫిక్ ఇబ్బందులు
మార్కెట్ రోడ్, స్టేషన్ రోడ్, శ్రీనివాస థియేటర్ రోడ్డులో అండర్ డ్రైనేజ్, విద్యుత్ ఆధునికీకరణ పనుల నేపథ్యంలో రోడ్ల మరమ్మత్తులు జరుగుతున్నాయి. ఈ పనుల కారణంగా మంచిర్యాలలో ట్రాఫిక్ సమస్యలు తీవ్రంగా ఇబ్బంది పెడుతున్నాయి. వాహనదారులకు ఇక్కట్లు తప్పడం లేదు. తరచుగా ప్రమాదాలు, ఘర్షణలు చోటు చేసుకుంటున్నాయి.
త్వరగా పనులు పూర్తి చేయాలని విజ్ఞప్తి
ఈ పనులు త్వరగా ముగిస్తే తప్ప వాహనదారులకు ఊపిరి పీల్చుకునే అవకాశం కనిపించడం లేదు. రోడ్ల పనులు వేగవంతం చేసి, ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని వాహనదారులు కోరుతున్నారు.