మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 24
మచి్యాల మన్సిపల్ కా్పొేషన్ పిధిలోని 16వ ివిజన్ మల్కలలోని ాళ్లవాగపై లో లవల్ వతన ని్మాణ అసపూ్తిగా ఉటతో ైతల తీవ్ ఇబ్బదల ఎద్కొటన్నా. పోచపా శివాలోని వ్యవసాయ పొలాలక వళ్లేదక మా్గ లేక ైతల ఆదోళన వ్యక్త చేస్తన్నా.
మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 16వ డివిజన్ ముల్కలలోని రాళ్లవాగుపై లో లెవెల్ వంతెన నిర్మాణం అసంపూర్తిగా ఉండటంతో అవతల వైపు ఉన్న పోచంపాడు శివారు వ్యవసాయ పొలాలకు వెళ్లేందుకు వాగొడ్డుపల్లె రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
నిధుల జాప్యంపై అనుమానాలు
2 కోట్ల పంచాయతీరాజ్ నిధులతో వంతెన నిర్మించేందుకు 2024 నవంబర్ 1వ తేదీన ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్ రావు శంకుస్థాపన చేశారు. మూడు నెలల క్రితం టెండర్ పిలవగా లక్షెట్టిపేటకు చెందిన కాంట్రాక్టర్ శ్రావణ్ టెండర్ దక్కించుకొని పనులు ప్రారంభించారు. ఇటీవల కురిసిన వర్షాలకు రాలి వాగు ప్రాజెక్టు నుంచి వరద రావడంతో పనులు నిలిచిపోయాయి. సుమారు 1.50 కోట్ల వరకు వంతెన పనులు పూర్తయ్యాయని, ప్రభుత్వం నుంచి నిధులు విడుదల కాలేదని సమాచారం. నిధులు మంజూరు కాకపోవడంతోనే కాంట్రాక్టర్ పనుల్లో జాప్యం చేస్తున్నాడని రైతులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
రైతుల ఆందోళన
పనులు నిలిచిపోవడంతో అటువైపు వెళ్లేందుకు గతంలో ఉన్న రోడ్డు సైతం లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆందోళన చెందుతున్నారు. పోచంపాడు శివారులోని తమ వ్యవసాయ భూములకు వెళ్లేందుకు కొట్టే సత్యం, సామంతుల అంజయ్య, మోట పలుకుల శంకరయ్య, రాగం శెట్టి శంకరయ్య, బుర్రి మల్లేష్ తదితరులు రోడ్డును నిర్మించుకున్నారు.
త్వరితగతిన పనులు పూర్తి చేయాలని డిమాండ్
ఏదేమైనా వంతెన పనులను త్వరితగతిన పూర్తి చేసి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.












