హజీపూర్, 2026-06-05
నానో యూరియా వాడకం ద్వారా రైతులు తమ సాగు ఖర్చులను గణనీయంగా తగ్గించుకునే అవకాశం ఉందని హాజీపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ తెలిపారు. సోమవారం గొల్లపల్లిలో ఆత్మ ఆధ్వర్యంలో నిర్వహించిన క్షేత్ర పర్యటనలో ఆయన ఈ విషయాలు వెల్లడించారు.
నానో యూరియా వినియోగం ద్వారా సాగు ఖర్చులను తగ్గించుకోవచ్చని హాజీపూర్ మండల వ్యవసాయ శాఖ అధికారి కృష్ణ రైతులకు సూచించారు. సోమవారం ఆత్మ ఆధ్వర్యంలో హాజీపూర్ మండలం గొల్లపల్లిలో నిర్వహించిన క్షేత్ర పర్యటనలో ఆయన పాల్గొన్నారు. డ్రోన్ ద్వారా నానో యూరియా, డీఏపీ ఎరువులను వినియోగించే విధానంపై రైతులకు వివరించారు. పంటలకు ప్రత్యామ్నాయంగా పప్పు ధాన్యాలు, ఆరుతడి పంటలు, ఆయిల్ ఫామ్ సాగు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏఈఓ కొమురయ్యతో పాటు రైతులు పాల్గొన్నారు.












