సంగారెడ్డి, 19 October
తెలంగాణ గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్ ఆవిష్కరించగా, సర్వాయి పాపన్న విగ్రహానికి గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజ్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.
తెలంగాణ గీత కార్మిక సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో లోని సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహం వద్ద కల్లుగీత కార్మిక సంఘం 69వ వార్షికోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం జెండాను జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్ ఆవిష్కరించారు. సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహానికి గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజ్ గౌడ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు. కల్లు గీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు ఆశన్న గౌడ్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజు గౌడ్ మాట్లాడుతూ, కల్లుగీత కార్మిక సంఘం ఏర్పడి 69 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా వార్షికోత్సవాలను అంగరంగ వైభవంగా, ఉత్సవాలు బాగా జరిపారని అన్నారు. కల్లుగీత కార్మిక సంఘం మొదటినుండి సమరశీల పోరాటం చేస్తూ, కల్లుగీత కార్మికుల హక్కుల కోసం పోరాటాలు నిర్వహిస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వీరేశం గౌడ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్, గౌడ సంఘం యువ నాయకులు మధు గౌడ్, కల్లుగీత కార్మిక సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ జంగన్న గౌడ్, ప్రచార కార్యదర్శి వెంకటేశం గౌడ్, జిల్లా కమిటీ సభ్యులు రామాగౌడ్, యాదాగౌడ్, ప్రవీణ్ గౌడ్, రవిగౌడ్, మండల అధ్యక్షుడు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షుడు కృష్ణ గౌడ్, మాజీ ఎంపీటీసీ పాండు గౌడ్, కవి రచయిత ఉమ్మన్నగారి కృష్ణ గౌడ్, నాయకులు సంగమేశ్వర్ గౌడ్, దుర్గ గౌడ్, నరసింహ గౌడ్, రాములు గౌడ్, ఈశ్వర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.












