జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆలూరులో గ్రామ సభను నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ పంచాయతీల పనితీరు, అభివృద్ధి కార్యక్రమాలపై సమగ్రంగా చర్చించారు.
గ్రామ సభలో WASH కార్యకలాపాల ప్రాముఖ్యతను, స్థానికంగా నీటి సరఫరా, పారిశుధ్యం, పరిశుభ్రత సేవలను మెరుగుపరచాల్సిన ఆవశ్యకతను వివరించారు. సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సాధనలో, ODF Plus స్థితిని కొనసాగించడంలో గ్రామ పంచాయతీల క్రియాశీలక పాత్రను తెలియజేశారు.
గ్రామ పంచాయతీల ఆర్థిక స్వావలంబనను పెంచేందుకు సొంత ఆదాయ వనరుల (OSR) సృష్టిపై దృష్టి సారించాలని సూచించారు. స్వయం సమృద్ధి కలిగిన స్థానిక పాలనను ప్రోత్సహించే 'ఆత్మనిర్భర్ పంచాయత్' ఆశయాలను వివరించారు.
గ్రామంలో ద్రవ వ్యర్థాల నిర్వహణను మెరుగుపరిచే దిశగా, కమ్యూనిటీ ఇంకుడు గుంతల నిర్మాణానికి అవసరమైన స్థలాలను గుర్తించి, మార్కౌట్లు చేశారు. ఇది గ్రామంలో పారిశుద్ధ్య పరిస్థితులను మెరుగుపరచడంలో దోహదపడుతుంది.
ఈ కార్యక్రమంలో ఎంపీఓ అజిజ్ ఖాన్, పలువురు ప్రభుత్వ శాఖల అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు, వార్డు సభ్యులు, మరియు గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. పంచాయతీల పాత్రపై అవగాహన కల్పించారు.











