తెలంగాణ ఉద్యమ నేత, స్వాతంత్ర్య సమరయోధుడు కొండా లక్ష్మణ్ బాపూజీ సామాజిక సమానత్వం, న్యాయం, బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి చేసిన కృషి జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ అన్నారు. సంగారెడ్డిలోని ఫ్రూట్ రీసెర్చ్ స్టేషన్ (ఎఫ్ఆర్ఎస్) వద్ద కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహం వద్ద ఆదివారం ఆయన జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు.
జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రతీక్ జైన్ కొండా లక్ష్మణ్ బాపూజీ విగ్రహానికి పుష్పమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ ప్రజల హక్కులు, సామాజిక న్యాయం, సమానత్వం కోసం జీవితాంతం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి శాసన సభ్యులు చింతా ప్రభాకర్, మున్సిపల్ చైర్ పర్సన్ కూన వనిత సంతోష్, గ్రంథాలయ సంస్జ చైర్మన్ అంజయ్య, వడ్డెర సంఘం అధ్యక్షుడు లింగయ్య, కౌన్సిలర్ నాని, గౌడ సంఘం జిల్లా అధ్యక్షుడు నక్క నాగరాజుగౌడ్, రాష్ట్ర బీసీ సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుగౌడ్, బీసీ సంఘం జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ పాటిల్, విశ్వబ్రాహ్మణ సంఘం ప్రసిడెంట్ అశోక్ చారి, బీసీ సంఘం యూత్ ప్రెసిడెంట్ గోరుగంటి రమేశ్ కుమార్, కల్లు గీత కార్మిక సంఘం నాయకులు ప్రభు గౌడ్, వీరశైవ లింగాయత్ జిల్లా అధ్యక్షుడు ఇప్పపల్లి నర్సింలు, కుమ్మరి సంఘం జిల్లా అధ్యక్షుడు కుమ్మరి సాయిలు, టీఎన్జీవో జిల్లా అధ్యక్షుడు జావిద్ అలీ, యువజన సంఘాల సమితి అధ్యక్షుడు కోన వేణు, సంగారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడు కొప్పెరి వెంకట హరి హర కిషన్, గౌరవ అధ్యక్షుడు గొంట్యాల పండరి, వర్కింగ్ ప్రెసిడెంట్ నక్క రాఘవులు, కోశాధికారి పోల పుండరీకం, కార్యదర్శి సోమ రమేష్, ఉపాధ్యక్షులు కొడపాక యాదగిరి, మునిపల్లి విశ్వనాథం, ముఖ్య సలహాదారు యాగ్ని మురళి, గందమల్లె రాజు, గుండు సత్యనారాయణ, తౌటి భగవాన్ దాస్ పాల్గొన్నారు. అలాగే, వివిధ పద్మశాలి కుల సంఘం నాయకులు, టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు అమర్ నాథ్, సహాయ వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి జగదీష్, వసతి గృహ సంక్షేమాధికారులు, మరియు కార్యాలయ సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.












