పోస్టల్ డివిజన్ పరిధిలో జాతీయ తపాల వారోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ నెల 9 నుండి 15 వరకు జరిగే ఈ వారోత్సవాల సందర్భంగా, ఖాసీంపూర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో డాక్ చౌపాల్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పోస్టల్ పొదుపు పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.
డివిజన్ పోస్టల్ ఎస్పి బి.అంబేద్కర్ రాజు తెలిపిన వివరాల ప్రకారం, ఈ నెల 9 నుండి 15 వరకు జాతీయ తపాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ నెల 9న వరల్డ్ పోస్ట్ డే ను నిర్వహించారు. నేషనల్ పోస్టల్ వీక్ ను పురస్కరించుకుని జిల్లాలో వివిధ కార్యక్రమాలు చేపట్టారు. జహీరాబాద్ సబ్ డివిజన్ పోస్టల్ ఇన్స్పెక్టర్ బి. రత్నయ్య ఆధ్వర్యంలో చరాకుపల్లి సబ్ ఆఫీస్ పరిధిలోని ఖాసీంపూర్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ లో డాక్ చౌపాల్ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోస్టల్ ఇన్స్పెక్టర్ బి. రత్నయ్య మాట్లాడుతూ పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఉన్న వివిధ పొదుపు పథకాల గురించి ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఒకేరోజు 150 పొదుపు ఖాతాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఖాసింపూర్ సర్పంచ్ బి.రవి, ఉప సర్పంచ్ రమేష్, గ్రామ ప్రజలు అధిక సంఖ్యలో హాజరయ్యారు.











