సంగారెడ్డి పట్టణంలోని బ్రాహ్మణవాడలో గురునానక్ మందిర్ కమాన్ల నిర్మాణానికి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. గత గురునానక్ జయంతి సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు ఈ నిర్మాణాలు చేపట్టారు. మందిర్ ప్రవేశ మార్గంలో ఒకటి, భవాని మందిర్ రోడ్డులో మరొక కమాన్ ఏర్పాటు చేయనున్నారు.
గత గురునానక్ జయంతి సందర్భంగా ఇచ్చిన హామీ మేరకు సంగారెడ్డి పట్టణంలోని బ్రాహ్మణవాడలో రెండు కమాన్ల నిర్మాణానికి జగ్గారెడ్డి సోమవారం భూమిపూజ చేశారు. గురునానక్ మందిర్‌కు వెళ్లే ప్రవేశ మార్గంలో ఒకటి, మందిర్‌కు సమీపంలోని భవాని మందిర్ రోడ్డులో మరొక కమాన్ ఏర్పాటుకు ఆయన శ్రీకారం చుట్టారు. అంతకుముందు గురునానక్ మందిర్‌ను సందర్శించిన జగ్గారెడ్డి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా మందిర్ ప్రతినిధులు పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. వాటిని త్వరలో పరిష్కరిస్తానని జగ్గారెడ్డి హామీ ఇచ్చారు.
మందిర్ ప్రాంగణంలో రావిచెట్టు కింద ఉన్న నాగదేవత ఆలయాన్ని అభివృద్ధి చేయాలని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్‌కు జగ్గారెడ్డి సూచించారు. ప్రస్తుతం ఉన్న విగ్రహాలను యథాస్థానంలోనే ఉంచి అభివృద్ధి పనులు చేపట్టాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిక్కు ప్రముఖులు డాక్టర్ సర్దార్ సురేందర్ గోపి సింగ్, సర్దార్ తేజేందర్ సింగ్, సర్దార్ స్వరణ్ సింగ్, సర్దార్ సత్పాల్ సింగ్, డాక్టర్ సర్దార్ భరత్ సింగ్, సిక్కు గురువు గురుదేవ్ సింగ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి తోపాజీ అనంత్ కిషన్, మున్సిపల్ చైర్పర్సన్ కూన వనిత సంతోష్, నాయకులు బొంగుల రవి, కూన సంతోష్, మహేష్ ముదిరాజ్, శ్రీహరి, సుదీప్, నరేన్, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.











