మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలోని మేంపల్లిలో పద్మావతి గార్డెన్లో ఆదివారం జరిగిన ముదిరాజ్ సింహ గర్జన కార్యక్రమంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకట స్వామి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ముదిరాజ్ సంఘం చేసిన విజ్ఞప్తులను పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
కామారెడ్డి డిక్లరేషన్లో అభయహస్తం హామీ మేరకు, జీవో 15 (19-02-2009) ప్రకారం ముదిరాజ్, ముత్తరాసి/తెనుగు (బీసీ-డీ నుంచి బీసీ-ఏ పునరుద్ధరణ) లను వెంటనే బీసీ-ఏ లోకి మార్చాలని ఆయన సూచించారు. 50 సంవత్సరాలు నిండిన ఇతర కులస్తులకు ఇచ్చిన మాదిరిగానే ముదిరాజ్ మత్స్యకారులకు కూడా సంఖ్యాన్ సౌకర్యం కల్పించాలని కోరారు. ముదిరాజుల అభివృద్ధి కోసం ముదిరాజ్ కో ఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ ఏర్పాటు చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సొసైటీకి ప్రతి సంవత్సరం 1000 కోట్ల నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. జీవో ఎంఎస్ నెం 98/1964, జీవో ఎంఎస్ నెం. 74/2011, జీవో నెం. 4/2022, జీవో ఎంఎస్ నెం. 16 జీవోల ప్రకారం, తెనుగు / ముదిరాజ్ / ముత్తరాసి / బెస్త / గంగపుత్ర మరియు గుండ్ల కులాలకు సంబంధించిన మత్స్యకార హక్కుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ మత్స్య అభివృద్ధి బోర్డును ఏర్పాటు చేయాలని కోరారు.
రాజకీయంగా ఎదగడానికి ముదిరాజులకు రాజ్యసభ, శాసనమండలి, శాసనసభలో అవకాశం కల్పిస్తూ, కార్పొరేషన్లలో ముదిరాజుల సమస్యల సాధనకు కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాష్, రాష్ట్ర నేతలు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కొమురయ్య, కృష్ణ, రాష్ట్ర కార్యదర్శి దబ్బెట తిరుపతి తదితరులు పాల్గొన్నారు.











