మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 09
పపపుకుకొుహు.ఈఎెేకొకకపేు,జడఅధకషుుకొకకుేఖపొహకకుు,కషేకభఇు.
ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఆదివాసీ సోదరులు, సోదరీమణులు ఘనంగా నిర్వహించిన ర్యాలీలో మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు, జిల్లా మాజీ డీసీసీ అధ్యక్షురాలు శ్రీమతి కొక్కిరాల సురేఖ పాల్గొన్నారు. ఐబీ చౌరస్తా నుండి పద్మనాయక ఫంక్షన్ హాల్ వరకు జరిగిన ఈ భారీ ర్యాలీని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు జెండా ఊపి ప్రారంభించారు.
ఆకాంక్షలు, భరోసా
ఈ సందర్భంగా ఆదివాసీల హక్కులు, ఆత్మగౌరవం, సంస్కృతి, సంప్రదాయాల పరిరక్షణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని నాయకులు ఆకాంక్షించారు. ఆదివాసీ సమాజ అభ్యున్నతికి, వారి సంక్షేమానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు భరోసా ఇచ్చారు. ఆదివాసీ సంస్కృతి మన గర్వమని, వారి హక్కుల పరిరక్షణ మన బాధ్యత అని ఈ సందర్భంగా గుర్తు చేశారు.
శుభాకాంక్షలు
ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు, సురేఖమ్మ ఆదివాసీలందరికీ ప్రపంచ ఆదివాసీ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, కార్పొరేటర్లు, ఆదివాసీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.










