మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 09
మంచిర్యాలజిల్లావిశ్వబ్రాహ్మణలు విద్యార్థులకుప్రతిభాపురస్కారాలుఅందజేశారు.ఈకార్యక్రమానికిసంఘంఅధ్యక్షుడుకస్తూరిశ్రీనాథ్చారి,ప్రధానకార్యదర్శిరావులహరీష్అధ్యక్షతవహించారు.
మంచిర్యాల జిల్లా విశ్వబ్రాహ్మణ సంఘం మరియు ఆధ్వర్యంలో 10వ తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు అందజేశారు. ఈ కార్యక్రమానికి సంఘం అధ్యక్షుడు కస్తూరి శ్రీనాథ్ చారి, ప్రధాన కార్యదర్శి రావుల హరీష్ అధ్యక్షత వహించారు.
ముఖ్య అతిథుల ప్రసంగం
విశ్వ బ్రాహ్మణ అఫీషియల్స్ ప్రొఫెషనల్స్ () వ్యవస్థాపకులు వేములవాడ ద్రోణాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చొల్లేటి కృష్ణమా చారి, ఉపాధ్యక్షుడు కట్టా విష్ణు వర్ధన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. జిల్లా నాయకులు అడ్వకేట్ పోలోజు చిరంజీవి, బెజ్జెంకి జగన్, మొగ్దుంపురం వెంకటేశ్వర్లు కూడా పాల్గొన్నారు.
సన్మాన కార్యక్రమం
ఈ సందర్భంగా విద్యార్థులకు మెమంటో, శాలువా, ప్రశంసాపత్రం అందించి ఘనంగా సత్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమానికి అందరూ హాజరయ్యారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో జిల్లా విశ్వబ్రాహ్మణ నాయకులు గుండోజు రమేష్ చారి, కస్తూరి నరసింహ చారి, ఏలేశ్వరం రమేష్ చారి, బోనాల మనోహర్, జంబోజు రమేష్ చారి, కట్కొజ్వల వేణు, గొల్లపల్లి రాజెందర్, రాజు కుమార్, మియాపూరం వీరా చారి, రావుల లక్ష్మీ కాంతం, విద్యార్థుల తల్లిదండ్రులు పాల్గొన్నారు.










