నిర్మల్, 13 July
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బస్టాండ్ కాలనీకి చెందిన శివరాత్రి నరసింహులు దుబాయిలో గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కుటుంబ సభ్యులకు నవభారత్ వేల్ఫేర్ సొసైటీ సభ్యులు పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు.
నిర్మల్ జిల్లా సారంగాపూర్ మండలం బస్టాండ్ కాలనీకి చెందిన శివరాత్రి నరసింహులు ఇటీవల దుబాయిలో గుండెపోటుతో మృతి చెందారు. వారి కుటుంబ సభ్యులను కలసి నవభారత్ వేల్ఫేర్ సొసైటీ సభ్యులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. సొసైటీ ఆధ్వర్యంలో బాధిత కుటుంబానికి పదివేల రూపాయల ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో సొసైటీ అధ్యక్షుడు, సభ్యులు పాల్గొన్నారు.












