హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని సూరారం గ్రామంలో మంగళవారం రాత్రి ఎలుగుబంటి సంచారం కలకలం రేపింది, గ్రామంలోని ముస్లిం కాలనీలో ప్రజలు తీవ్ర భయంతో ఉన్నారు.
గత మూడు రోజుల క్రితం గ్రామంలో వాకింగ్‌కు వెళ్లిన కొందరు గ్రామస్తులకు ఎలుగుబంటి కనిపించడంతో వారు భయంతో పరుగులు తీశారు. నాలుగు రోజుల తర్వాత మళ్లీ ముస్లిం కాలనీలో ఎలుగుబంటి సంచరిస్తూ కనిపించడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సాయంత్రం వేళల్లో ఇళ్ల బయటకు రావాలంటేనే భయపడుతున్నామని కాలనీ వాసులు తెలిపారు. చిన్నపిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లేందుకు కూడా జంకుతున్న పరిస్థితి నెలకొంది.
గ్రామస్తులు స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు మరియు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ అధికారులు తక్షణమే స్పందించి అవసరమైన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు.








