హైదరాబాద్, 2023-08-25
వక్స్బోర్డ్సభ్యులవేధింపులకారణంగానేగిరిఅనేవ్యక్తిఆత్మహత్యచేసుకున్నారని,దీనికిబాధ్యులైనవారినికఠినంగాశిక్షించాలనిమనమహాసభ విమర్శనాయకులుడిమాండ్చేశారు.ఈఘటనపైసమగ్రవిమర్శచారణజరిపించాలనివారుకోరారు.
వక్స్ బోర్డ్ సభ్యుల తీవ్ర ఒత్తిడి కారణంగా ఒకరి ప్రాణం బలయిందని, దీనికి కారకులైన వారిని వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని మన ముదిరాజ్ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చొప్పరి శంకర్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి సలేందర్ శివయ్య ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈటెల భద్రయ్య, తుమ్ముల గంగాధర్ ముదిరాజ్ తదితరులు డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆత్మహత్య చేసుకున్న గిరి భౌతికకాయాన్ని రాష్ట్ర అధ్యక్షులు శంకర్ ముదిరాజ్, భద్రయ్య ముదిరాజ్, తుమ్మల గంగాధర్, పిట్ల నగేష్ ముదిరాజ్ సందర్శించారు.
ఆత్మహత్యకు దారితీసిన పరిస్థితులు
గత ఐదు దశాబ్దాలకు పైగా బొగ్గుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్న తమ స్థలంపై కోర్టు తీర్పు తమకు అనుకూలంగా వచ్చినప్పటికీ, వక్స్ బోర్డ్ సభ్యులు సూటిపోటి మాటలతో తీవ్రంగా వేధించడంతో మనోవేదనకు గురైన గిరి, తనకు జరిగిన అవమానాలను ఒక వీడియో రూపంలో సైతం రూపొందించి ఆత్మహత్య చేసుకోవడం దురదృష్టకరమని, దీనిపై సమగ్ర విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు.
హెచ్చరిక
వక్స్ బోర్డ్ సభ్యుల వేధింపుల కారణంగానే గిరి ముదిరాజ్ ఆత్మహత్య చేసుకున్నారని, ఈ విషయంలో ప్రభుత్వం జోక్యం చేసుకొని దోషులను కఠినంగా శిక్షించకపోతే, రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ముదిరాజ్ మహాసభ నాయకులు హెచ్చరించారు.
సానుభూతి
మరణించిన గిరి ముదిరాజ్ తండ్రి అయిన తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ కీలక నాయకులు సదానందం ముదిరాజ్ కు ముదిరాజ్ మహాసభ నాయకులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.
పాల్గొన్నవారు
ఈ కార్యక్రమంలో పలువురు ముదిరాజ్ సంఘం రాష్ట్ర నాయకులు, ఇతర సభ్యులు పాల్గొన్నారు. వారు గిరి భౌతికకాయాన్ని సందర్శించి నివాళులర్పించి, మరణానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు.












