మంచిర్యాల పట్టణంలో మానసిక, శారీరక వైకల్యంతో బాధపడుతున్న ఏడేళ్ల బాలుడు విక్రమ్ కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటోంది. ఈ నేపథ్యంలో, ఇండియన్ డెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు లయన్ వి. మధుసూదన్ రెడ్డి వారికి అండగా నిలిచారు.
నరసయ్య అనే ఆటో డ్రైవర్ కుమారుడు విక్రమ్, పుట్టుకతోనే వైకల్యంతో జన్మించాడు. అతని తల్లి కూడా మూర్ఛ వ్యాధితో బాధపడుతోంది. వైద్యం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేయాల్సి రావడంతో కుటుంబం ఆర్థికంగా చితికిపోయింది.
కుటుంబ సభ్యులు సహాయం కోసం లయన్ వి. మధుసూదన్ రెడ్డిని ఆశ్రయించగా, ఆయన మానవతా దృక్పథంతో స్పందించారు.
విక్రమ్ కు ఒక సంవత్సరం పాటు అవసరమైన మందులను అందజేస్తానని హామీ ఇచ్చిన ఆయన, రెండవ విడతగా రెండు నెలలకు సరిపడా ఖరీదైన మందులను బాలుడికి అందించారు.
ఈ సందర్భంగా, ఇతర స్వచ్ఛంద సంస్థలు కూడా ముందుకు వచ్చి విక్రమ్ కు సహాయం చేయాలని ఆయన కోరారు.












