హైదరాబాద్‌లోని షాపూర్‌నగర్‌లో ఉన్న ఏపీజే అబ్దుల్ కలాం జూనియర్ కళాశాలను తెలంగాణ గజిటెడ్ ప్రధానోపాధ్యాయుల సంఘం రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షుడు గుండం మోహన్ రెడ్డి శనివారం సందర్శించారు. కళాశాల కరస్పాండెంట్ ఎం.రాంమోహన్ రావు ఆహ్వానం మేరకు ఆయన కళాశాలకు విచ్చేసి, బోధనాభ్యసన ప్రక్రియలను పరిశీలించారు.
కళాశాల ప్రారంభించిన అతి స్వల్ప కాలంలోనే విద్యార్థులకు మెరుగైన విద్యాబోధన అందిస్తూ అద్భుతమైన ఫలితాలు సాధించడం అభినందనీయమని గుండం మోహన్ రెడ్డి పేర్కొన్నారు. విద్యార్థుల ప్రతిభను వెలికితీసేలా బోధనా విధానాలను రూపొందించడం, నాణ్యమైన విద్యను అందించేందుకు అధ్యాపక బృందం చేస్తున్న కృషిని ఆయన ప్రశంసించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ షేక్ జహీద్, కరస్పాండెంట్ ఎం. రాంమోహన్ రావుతో పాటు ఆచార్య బృందాన్ని గుండం మోహన్ రెడ్డి అభినందించారు. భవిష్యత్‌లోనూ విద్యార్థుల విద్యాభివృద్ధికి మరింత కృషి చేసి కళాశాలకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.
తొలిసారిగా తమ కళాశాలను సందర్శించి, విద్యా కార్యక్రమాలు, యోగక్షేమాలను తెలుసుకున్న గుండం మోహన్ రెడ్డికి కళాశాల యాజమాన్యం కృతజ్ఞతలు తెలిపింది. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసింది. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు.











