ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకొని లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత కంటి నిర్ధారణ శిబిరంలో ఎంపికైన 24 మందికి రేకుర్తి ఐ హాస్పిటల్ కరీంనగర్ లో ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించారు. శస్త్ర చికిత్సల అనంతరం వారిని స్వస్థలాలకు తరలించారు.
లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో లైన్స్ భవన్ ప్రాంగణంలో ఈ శిబిరం జరిగింది. లయన్స్ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సహకారంతో, రేకుర్తి ఐ హాస్పిటల్ కరీంనగర్ లో అన్ని వసతులు ఉచితంగా సమకూరుస్తూ ఈనెల 13వ తేదీన 24 మందికి ఉచిత కంటి శస్త్ర చికిత్సలు నిర్వహించినట్లు ప్రోగ్రాం కోఆర్డినేటర్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి తెలిపారు.
శస్త్ర చికిత్సలు పూర్తయిన తర్వాత, బాధితులను ఈరోజు ఆపరేషన్లు ముగించుకొని మంచిర్యాలలోని వారి స్వస్థలాలకు చేర్చారు. ఈ సందర్భంగా మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ, ఆపరేషన్ల అనంతరం తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. వారికి పండ్లు, మందులు కూడా పంపిణీ చేశారు.
ఇది లయన్స్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిరంతరం నిర్వహిస్తున్న సేవా కార్యక్రమంలో భాగమని, కావున ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.
ఈ కార్యక్రమంలో లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు లయన్ పి. వెంకటేశ్వర్లు, ప్రోగ్రాం కోఆర్డినేటర్స్ లయన్ వి. మధుసూదన్ రెడ్డి, లయన్ డాక్టర్ కే. సుగుణాకర్ రెడ్డి, లయన్ ఎం. వెంకటేశ్వర్లు, లయన్ మెంబర్స్ లయన్ రామాంజనేయులు, లైన్ డేగ బాబు, జోన్ చైర్ పర్సన్ లయన్ తిరుపతి తదితరులు పాల్గొన్నారు.












