ప్రపంచ పోలియో దినోత్సవం సందర్భంగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాల్ పోస్టర్లను విడుదల చేశారు. జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి () డాక్టర్ శ్రీ నరేందర్ రాథోడ్ ఈ కరపత్రాలను తన చాంబర్లో ఆవిష్కరించారు.
ప్రపంచ పోలియో దినోత్సవం ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు. మానవాళిని దశాబ్దాల పాటు పీడించిన పోలియో మహమ్మారిపై సాధించిన విజయాన్ని, దాని నిర్మూలన కోసం జరుగుతున్న పోరాటాన్ని స్మరించుకోవడానికి ఈ రోజున కేటాయించారు. పోలియో నివారణకు వ్యాక్సిన్ కనుగొన్న శాస్త్రవేత్తల బృందానికి నాయకత్వం వహించిన డాక్టర్ జోనస్ సాల్క్ జన్మదినం అయిన న ఆయన జ్ఞాపకార్థం ఈ తేదీని ఎంచుకున్నారు.
పోలియో అనేది ఒక ప్రమాదకరమైన వైరస్ వల్ల వస్తుంది, ఇది ప్రధానంగా 5 ఏళ్లలోపు పిల్లలపై ప్రభావం చూపుతుంది. కలుషితమైన ఆహారం, నీరు లేదా అశుభ్రత వల్ల ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంది.
దీనిని అరికట్టడానికి భారత ప్రభుత్వం 1995లో పల్స్ పోలియో కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రారంభించింది. రెండు చుక్కలు నిండు జీవితం అనే నినాదంతో కోట్లాదిమంది చిన్నారులకు ప్రత్యేక పోలియో చుక్కలు వేశారు.
ఈ సందర్భంగా, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ ఆధ్వర్యంలో పోలియోపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వాల్ పోస్టర్లను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి () డాక్టర్ శ్రీ నరేందర్ రాథోడ్ తన చాంబర్లో ఆవిష్కరించారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ కె భాస్కర్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వి మధుసూదన్ రెడ్డి, జిల్లా శాఖ కార్యదర్శి చండూరు మహేందర్, ఆరోగ్యశాఖ సిబ్బంది పాల్గొన్నారు.












