మంచిర్యాల జిల్లా జైపూర్ మండలం కాన్కూర్ గ్రామంలో మెడికవర్ హాస్పిటల్ ఆధ్వర్యంలో గురువారం ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో సుమారు 150 మందికి పైగా రోగులకు నిపుణులైన వైద్యులు పరీక్షలు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేశారు.
గ్రామీణ ప్రాంత ప్రజలకు నాణ్యమైన సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. శిబిరంలో అవసరమైన వారికి షుగర్, బీపీ, ఈసీజీ వంటి పరీక్షలు చేసి తక్షణ రోగ నిర్ధారణ చేపట్టారు.
మెడికవర్ ఆసుపత్రి సెంటర్ హెడ్ గుర్రం కిరణ్ మాట్లాడుతూ, గ్రామీణ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం తమ సామాజిక బాధ్యత అని పేర్కొన్నారు. 24 గంటలూ అన్ని రకాల సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులో ఉంటాయని, అవసరమైతే రోగులను కరీంనగర్లోని ఆసుపత్రికి తరలించి ఆధునిక వైద్యం అందిస్తామని తెలిపారు.
గ్రామ సర్పంచ్ కొయ్యడ వెంకటేశ్వర్, ఉపసర్పంచ్ పొన్నం చంద్ర మాట్లాడుతూ, ఉచిత వైద్య సేవలు అందించిన మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ మార్కెటింగ్ మేనేజర్ కోట కరుణాకర్, అబ్దుల్ వకీల్, శ్రీకాంత్, సిద్దు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.












