మంచిర్యాల (అక్షరవేకువ) జూలై 06
పరపంచజూోదోతంపరరంచమంచరయపరథమపశైదయందరంోఉచతరబరయరమం32శజరగంద.ఈరయరమంోజెరమరదప,మయరధరమధరతోపపరఅధర,పరజపరతధపగొర.ఈందరభంగపెంపడశర.
ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా, పశు వైద్య మరియు పశు సంవర్ధక శాఖ ఆధ్వర్యంలో మంచిర్యాలలోని ప్రాథమిక పశు వైద్య కేంద్రంలో ఉచిత రేబిస్ టీకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్, మంచిర్యాల మేయర్ ధరణి మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, స్థానిక కార్పొరేటర్ హరికృష్ణ, జిల్లా పశువైద్య మరియు పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ యాకుబ్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా పెంపుడు కుక్కలకు 32 రేబిస్ వ్యాధి నివారణ టీకాలు వేశారు. కార్యక్రమంలో మంచిర్యాల ప్రాథమిక పశు వైద్య కేంద్రం పశువైద్యాధికారి డాక్టర్ శాంతి రేఖ, లైవ్ స్టాక్ అసిస్టెంట్ సోనియా, పశు వైద్య సహాయకులు గోవర్ధన్, గోపాలమిత్ర వేణు, స్థానిక పెంపుడు కుక్కల యజమానులు పాల్గొన్నారు.
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ మాట్లాడుతూ, మనుషుల నుంచి జంతువులకు, జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే వ్యాధులను 'జూనోటిక్ వ్యాధులు' అంటారని వివరించారు. రైతులు, పశుపోషకులు తప్పనిసరిగా కొన్ని జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జంతువులకు సకాలంలో టీకాలు వేయించడం, అనారోగ్యంతో ఉన్న వాటిని వేరుగా ఉంచడం, పాలు, మాంసాన్ని పరిశుభ్రంగా నిర్వహించడం, చనిపోయిన జంతువులను శాస్త్రీయ పద్ధతిలో పారవేయడం, అనుమానాస్పద లక్షణాలు కనిపిస్తే వెంటనే వెటర్నరీ వైద్యులను సంప్రదించడం అత్యవసరమని తెలిపారు.
రేబీస్ వ్యాధి 100% నివారించదగినదని, కుక్కలు, పిల్లులకు క్రమం తప్పకుండా టీకాలు వేయించడం ద్వారా కుటుంబాలను, సమాజాన్ని సురక్షితంగా ఉంచుకోవచ్చని కలెక్టర్ పేర్కొన్నారు. చివరిగా, జూనోసిస్ దినోత్సవం సందర్భంగా 'ఆరోగ్యకరమైన జంతువులు – ఆరోగ్యకరమైన మనుషులు – ఆరోగ్యకరమైన సమాజం' అనే లక్ష్యంతో కలిసి పనిచేయాలని అందరికీ సూచించారు.










