మంచిర్యాల జిల్లా కేంద్రంలో అమాలివాడ టూ టౌన్ వాసుల సౌకర్యార్థం నిర్మించతలపెట్టిన ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి రూ.4 కోట్ల నిధులు కేటాయించినట్లు బిజెపి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ తెలిపారు. ఈ బ్రిడ్జి 57, 59 డివిజన్లను అనుసంధానిస్తుంది.
బిజెపి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ వివరాలు వెల్లడించారు. ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం 4 కోట్ల రూపాయలు మంజూరయ్యాయని, త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని ఆయన పేర్కొన్నారు.
ఈ బ్రిడ్జి నిర్మాణం పూర్తయితే పాదచారులు, విద్యార్థులు, మహిళలకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని, రెండు టౌన్ల మధ్య అనుసంధానం సులభతరం అవుతుందని ముఖేష్ గౌడ్ తెలిపారు. గతంలో ఈ సమస్యపై పలుమార్లు సెంట్రల్ రైల్వే అధికారులను కలిసి విజ్ఞప్తి చేసినట్లు ఆయన తెలిపారు.
ప్రజా సౌకర్యాల కల్పనకు బిజెపి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తుందని, ఈ ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణం ద్వారా 57, 56, 55, 23 డివిజన్ల ప్రజల చిరకాల అభీష్టం నెరవేరనుందని ఆయన అన్నారు.
ఈ నిర్మాణ ప్రక్రియపై బిజెపి ప్రత్యేక శ్రద్ధ వహించిందని, నిధుల కేటాయింపుతో పనులు వేగవంతం కానున్నాయని ఆయన తెలిపారు.











