సంగారెడ్డి, 9 November
డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో జరిగిన అండర్-14, అండర్-17 స్విమ్మింగ్ ఎంపిక పోటీల్లో ఆరుగురు క్రీడాకారులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.
స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాలబాలికల స్విమ్మింగ్ ఎంపిక పోటీలు లోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో నిర్వహించారు. జిల్లా ఎస్జీఎఫ్ ఆర్గనైజింగ్ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ పోటీలను పీఈటీలు, పీడీలు కిష్టయ్య, కృష్ణ, దుర్గాప్రసాద్ పర్యవేక్షించారు. స్విమ్మింగ్ లోని వివిధ విభాగాలతో పాటు, ట్రైయాథ్లాన్, పెంటాథ్లాన్లో కూడా ఎంపికలు నిర్వహించారు. పోటీలలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా యువజన, క్రీడల అధికారి అఖిలేష్ రెడ్డి, వివిధ విభాగాల్లో విజేతలుగా నిలిచిన క్రీడాకారులకు పతకాలు అందజేశారు. రాజీవ్ పార్కు సమీపంలోని డీఎస్ఏ స్విమ్మింగ్ పూల్లో శిక్షణ పొందుతున్న మహమ్మద్ అబ్దుర్ రహమాన్, మహమ్మద్ ఉజైర్, భావజ్ఞ, రోషిత్, విహాన్, హానీష్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ సందర్భంగా ఎంపికైన క్రీడాకారులను డీవైస్ఓ అఖిలేష్ రెడ్డి అభినందించారు. ఈ కార్యక్రమంలో స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ (టీయూడబ్ల్యూజే ఐజేయు) జిల్లా అధ్యక్షుడు మొహమ్మద్ సిద్ధిఖ్, మహమ్మద్ పర్వేజ్, కొండల్ రెడ్డి, కిషోర్, మహమ్మద్ అఫ్రోజ్, రాము, డీఎస్సీ సిబ్బంది అభినవ్, పవన్ కళ్యాణ్, స్విమ్మింగ్ పూల్ సిబ్బంది పవన్ చౌహన్, కృష్ణ, కుమార్ తదితరులు పాల్గొన్నారు.



