జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ సమక్షంలో శ్రీ శ్రీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్, డీసీపీ పాల్గొని ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా నిర్వహించిన పూజా కార్యక్రమంలో గౌరవ జిల్లా కలెక్టర్, డీసీపీ పాల్గొని ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. వీరితో పాటు ది అఖిల్ భారతీయ విశ్వకర్మ మహాసభ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ నౌండ్ల సంతోష్ చారి, పలువురు విశ్వబ్రాహ్మణ కుల బంధువులు పాల్గొన్నారు.
పూజా కార్యక్రమం అనంతరం గౌరవ కలెక్టర్, డీసీపీ విశ్వకర్మ యజ్ఞ మహోత్సవం ప్రాధాన్యత, విశ్వకర్మ భగవానుని విశిష్టత, కార్యక్రమ సందేశాన్ని వివరించారు.
అనంతరం రాష్ట్ర అధ్యక్షులు బ్రహ్మశ్రీ నౌండ్ల సంతోష్ చారి గారు విశ్వబ్రాహ్మణ కుల బంధువులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను గౌరవ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లారు. ఆయా సమస్యలకు పరిష్కార మార్గాలను సూచించి, అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని విజ్ఞప్తి చేశారు.
దీనిపై గౌరవ కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ, అర్హత కలిగిన ప్రతి ఒక్కరూ ప్రభుత్వ సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. తదుపరి కలెక్టరేట్ నుండి ్ జగదాంబ కాంప్లెక్స్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ది అఖిల్ భారతీయ విశ్వకర్మ మహాసభ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి, ఎర్రోజు వేణుగోపాల చారి, తంగేళ్ళపల్లి అరుణ్ కుమార్ చారి, రంగు ప్రకాష్, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షులు ధర్మవరం బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు.








