తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు చంద్రిక కరుణాకర్ శనివారం హైదరాబాద్లో మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. హైదరాబాద్లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలపై చర్చించారు.
ఈ సందర్భంగా జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి చేపట్టాల్సిన కార్యక్రమాలు, ప్రజల్లో పార్టీ విధానాలను విస్తృతంగా తీసుకెళ్లే అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని కవిత సూచించినట్లు చంద్రిక కరుణాకర్ తెలిపారు. పార్టీ కార్యకలాపాలను మరింత చురుగ్గా నిర్వహించడంపై ఈ సందర్భంగా ఇరువురు నాయకులు అభిప్రాయాలు పంచుకున్నారు.











