మంచిర్యాలలోని గోదావరి రోడ్ లో ఉన్న మాతా శిశు కేంద్రం కు లైన్స్ క్లబ్ మంచిర్యాల ఆధ్వర్యంలో అవసరమైన వైద్య పరికరాలు, ఇతర వస్తువులను విరాళంగా అందించారు. సీనియర్ సభ్యులు సిరిపురం శ్రీనివాస్, జగదీష్ సహకారంతో ఈ సహాయం అందింది.
మాతా శిశు కేంద్రం ఆర్.ఎం.ఓ. డాక్టర్ కుమారస్వామి అభ్యర్థన మేరకు, ఆసుపత్రికి అత్యవసరంగా అవసరమైన వాల్ మౌంటింగ్ ఫ్యాన్, యాంటీ బరస్ట్ వెయిటెడ్ జిమ్ బాల్, మరియు 10 జతల పాదరక్షలను లైన్స్ క్లబ్ సభ్యులు అందజేశారు. ఈ వస్తువులను ప్రజల సౌకర్యార్థం ఆసుపత్రి ప్రాంగణంలో అందజేసినట్లు వి. మధుసూదన్ రెడ్డి తెలిపారు.
ఈ విరాళాల కార్యక్రమానికి లైన్స్ క్లబ్ మంచిర్యాల అధ్యక్షులు పి. వెంకటేశ్వర్లు అధ్యక్షత వహించారు. క్లబ్ సభ్యులు వి. మధుసూదన్ రెడ్డి, సిరిపురం శ్రీనివాస్, ఏ. రాజేశ్వరరావు, కొత్త సురేందర్ పాల్గొన్నారు. ఆసుపత్రి వైద్యులు, సిబ్బంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.










