బీజేపీ పార్టీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గాజుల ముకేశ్ గౌడ్ జన్మదిన వేడుకలను జిల్లా ఆటో యూనియన్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్నదానం, పండ్ల పంపిణీ, ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సేవ వంటి కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా, తలసేమియా వ్యాధిగ్రస్తుల కోసం 22 మంది ఆటో కార్మికులు రక్తదానం చేశారు.
బీజేపీ పార్టీ ఓబీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర జేఏసీ ఆటో ప్రణాళిక చైర్మన్, బీజేపీ ఫ్లోర్ లీడర్, 57వ డివిజన్ కార్పొరేటర్, ఆటో కార్మికుల ఆపద్బాంధవుడు శ్రీ గాజుల ముకేశ్ గౌడ్ అన్న గారి జన్మదిన వేడుకలను పురస్కరించుకొని జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు చెల్ల విక్రమ్ ఆధ్వర్యంలో లో ఘనంగా నిర్వహించారు. మా ముకేశ్ అన్న జన్మదినాన్ని పురస్కరించుకొని కేవలం కేక్ కటింగ్ లకే పరిమితం కాకుండా, ఆయన స్ఫూర్తితో పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు. కార్పొరేషన్ పరిధిలోని శ్రీరాంపూర్ బస్టాండ్ వద్ద ఉన్న నిరుపేదలకు, వృద్ధులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. 31వ డివిజన్ ఆదర్శ్ నగర్ లోని పేద చిన్నారులకు పండ్లు, బిస్కెట్లు పంపిణీ చేశారు.
ప్రభుత్వ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న రోగులకు, వారి సహాయకులకు ఫుడ్ ప్యాకెట్లు మరియు పండ్లు పంపిణీ చేశారు. తలసేమియా వ్యాధిగ్రస్తుల ప్రాణాలను కాపాడేందుకు 22 మంది ఆటో కార్మికులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. ఆటో డ్రైవర్లు రక్తదానం చేయడం అందరినీ ఆకట్టుకుంది.
ఈ సందర్భంగా చెల్ల విక్రమ్ మాట్లాడుతూ... మా ముకేశ్ అన్న కేవలం నాయకుడు మాత్రమే కాదు, 25 ఏళ్లుగా ప్రతి ఆటో కార్మికుడికి అండగా నిలిచిన మా కుటుంబ సభ్యుడు. చిన్నా పెద్దా తేడా లేకుండా అందరితో ప్రేమగా మాట్లాడే మంచి మనసున్న మనిషి. ఆయన ఆశయాలకు అనుగుణంగా, ఆయన పుట్టినరోజును సేవా దినంగా జరుపుకోవడం మాకు గర్వకారణం. ఆయన నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం అని తెలిపారు. ఈ కార్యక్రమంలో పొట్ట మధుకర్ ( జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షులు), కట్టా రామ్ కుమార్ (జేఏసీ అధ్యక్షులు), పులి రాజేందర్ గౌడ్ (నస్పూర్ టౌన్ ఆటో యూనియన్ అధ్యక్షులు), అంజన్న కలవల ( పట్టణ అధ్యక్షులు), పిల్లి ఆనంద్ (బెల్లంపల్లి మాజీ పట్టణ అధ్యక్షులు), జిల్లా, పట్టణ, మండల నాయకులు, పెద్ద సంఖ్యలో ఆటో కార్మికులు తదితరులు పాల్గొన్నారు.












