చెన్నూరు, 2026-09-09
మేరా రేషన్ మేరా అభియాన్ ( 2.0) నా పట్టు నా అభియాన్ కార్యక్రమంలో భాగంగా, చెన్నూరు మండలంలోని కృష్ణంపేట రైతు వేదికలో పట్టు పురుగుల రైతులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారు 144 మంది రైతులు పాల్గొన్నారు.
పట్టు రైతులకు విలువ ఆధారిత సాంకేతికతపై అవగాహన : MRMA 2.0 – మేరా రేషన్ మేరా అభియాన్ (నా పట్టు – నా అభియాన్) కార్యక్రమంలో భాగంగా చెన్నూరు మండలంలోని కృష్ణంపేట రైతు వేదిక హాల్లో పట్టు పురుగుల రైతులకు అవగాహన మరియు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని డా. కె.పి. కిరణ్ కుమార్, శాస్త్రవేత్త జాయింట్ డైరెక్టర్, కేంద్ర పట్టుమండలి, చెన్నూరు ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్. పార్వతి, జిల్లా పట్టు అధికారి సురేఖ, జిల్లా వ్యవసాయ అధికారి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సుమారుగా 144 మంది దశల పట్టు రైతులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. రైతులు పట్టు కాయలను నేరుగా విక్రయించడం ద్వారా పొందే ఆదాయంతో పోలిస్తే, పట్టు కాయలను ఉడకబెట్టి దారం తీసి విక్రయించడం ద్వారా అదనపు ఆదాయం పొందే అవకాశం ఉందని డా. కె.పి. కిరణ్ కుమార్ పేర్కొన్నారు. పట్టు ఆధారిత విలువ వృద్ధి కార్యకలాపాల ద్వారా రైతులకు సంవత్సరం పొడవునా ఉపాధి మరియు అదనపు ఆదాయ అవకాశాలు లభిస్తాయని ఆయన వివరించారు.












