సంగారెడ్డి, 2026-08-11
సంగారెడ్డి జిల్లాలో నాల్గవ తరగతి ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఉద్యోగ సంఘాల నాయకులు పిలుపునిచ్చారు. మంగళవారం జరిగిన స్టాండింగ్ కౌన్సిల్ సమావేశంలో ఈ మేరకు చర్చించారు.
సంగారెడ్డి జిల్లా తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల స్టాండింగ్ కౌన్సిల్ సమావేశం మంగళవారం సంగారెడ్డి సంఘ భవన్లో జిల్లా నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్, కార్యదర్శి జె.నాగరాజు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సమావేశానికి రాష్ట్ర తెలంగాణ నాల్గవ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు దాస్య నాయక్, కార్యదర్శి ఖాదర్ బిన్ హసన్, అసోసియేషన్ ప్రెసిడెంట్ రాజేందర్, కోశాధికారి ధనరాజ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అలాగే సంగారెడ్డి జిల్లా టీఎన్జీఓఎస్ సంఘం అధ్యక్షుడు మొహమ్మద్ జావిద్ అలీ, కార్యదర్శి వేల్పూరు రవి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా జావిద్ అలీ మాట్లాడుతూ, ప్రభుత్వ కార్యాలయాల నిర్వహణలో నాల్గవ తరగతి ఉద్యోగులు కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, వారి సమస్యలు ఇంకా పూర్తిస్థాయిలో పరిష్కారం కాలేదని అన్నారు. ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులు, బదిలీలు, సర్వీస్ సంబంధిత సమస్యలు, పెండింగ్లో ఉన్న ఇతర అంశాలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కోరారు.
దాస్య నాయక్ మాట్లాడుతూ నాల్గవ తరగతి ఉద్యోగుల సంక్షేమం, హక్కుల పరిరక్షణ కోసం సంఘం నిరంతరం కృషి చేస్తుందని నాయకులు పేర్కొన్నారు.
జిల్లా అధ్యక్షులు మహమ్మద్ షరీఫ్ మాట్లాడుతూ ఉద్యోగుల సమస్యలను ఎప్పటికప్పుడు రాష్ట్ర సంఘం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు. కార్యదర్శి నాగరాజు మాట్లాడుతూ ఉద్యోగులందరూ సంఘ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని తమ సమస్యలను సంఘం దృష్టికి తీసుకురావాలని కోరారు.
ఈ కార్యక్రమంలో అసోసియేట్ అధ్యక్షులు కసిని శ్రీకాంత్, వెంకట్ రెడ్డి, కోశాధికారి శ్రీనివాస్, ప్రమోద్, యాదవరెడ్డి, విజయ్, ఉద్యోగుల సంఘం నాయకులు, ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.











