మహాసభ (అక్షరవేకువ) నవంబర్ 26
గుడిహత్నూర్ లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు.
గుడిహత్నూర్ లో భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, రాజ్యాంగ స్ఫూర్తితోనే దేశంలో సామాజిక న్యాయం, సమానత్వం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్యం, విలువలు వచ్చాయని ప్రముఖులు కొనియాడారు.
పాల్గొన్న ప్రముఖులు
ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీలు మాధవ్ మస్కె, పతంగే బ్రహ్మానంద్, మాజీ గుడిహత్నూర్ ఉపసర్పంచ్ సిధార్థ ససానే, భారతీయ బౌద్ధ మహాసభ మండల అధ్యక్షులు వినోద్ జోన్ధలే, జనరల్ సెక్రటరీ గజభారే ధమ్మానంద్, ట్రెజరర్ దహికాంబ్లె ప్రథమానంద్, ఉపాధ్యక్షులు భాలేరావు జ్ఞనోబా, ఆనంద్‌రావు తదితరులు పాల్గొన్నారు.






