సారాంశం
హాజీపూర్ మండల కేంద్రంలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన బస్సు షెల్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది. దీంతో నిత్యం రాకపోకలు సాగించే వందలాది మంది ప్రయాణికులు ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా బస్టాండ్ వద్ద ఇబ్బందులు పడుతున్నారు.
ముఖ్య విషయాలు
- 1దీంతో నిత్యం రాకపోకలు సాగించే వందలాది మంది ప్రయాణికులు ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా బస్టాండ్ వద్ద ఇబ్బందులు పడుతున్నారు.
- 2హాజీపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కొన్నేళ్ల కిందట ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్, పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఉపయోగపడకుండా పోయింది.
- 3మండల కేంద్రం నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు వెళ్లే వందలాదిమంది ప్రయాణికులు జాతీయ రహదారిపై ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.
- 4నిర్లక్ష్యంతో నిరుపయోగమైన హాజీపూర్ బస్టాండ్: ప్రయాణికుల అవస్థలు
హాజీపూర్ మండల కేంద్రంలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన బస్సు షెల్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది.
Mancherial/Hajipur (అక్షరవేకువ) జూలై 13
హాజీపూర్ మండల కేంద్రంలో కొన్నేళ్ల క్రితం నిర్మించిన బస్సు షెల్టర్, అధికారుల నిర్లక్ష్యం కారణంగా నిరుపయోగంగా మారింది. దీంతో నిత్యం రాకపోకలు సాగించే వందలాది మంది ప్రయాణికులు ఎండ, వానలను సైతం లెక్కచేయకుండా బస్టాండ్ వద్ద ఇబ్బందులు పడుతున్నారు.
హాజీపూర్ మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై కొన్నేళ్ల కిందట ఏర్పాటు చేసిన బస్సు షెల్టర్, పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు ఉపయోగపడకుండా పోయింది. మండల కేంద్రం నుంచి నిత్యం వివిధ ప్రాంతాలకు వెళ్లే వందలాదిమంది ప్రయాణికులు జాతీయ రహదారిపై ఎండలో ఎండుతూ, వానలో తడుస్తూ బస్సుల కోసం ఎదురుచూస్తున్నారు.
జాతీయ రహదారి కావడంతో పలుమార్లు బస్సుల కోసం రహదారి దాటే ప్రయత్నంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. బస్సు షెల్టర్ ప్రైవేటు వ్యక్తులకు నివాసంగా ఉపయోగపడుతుందని, దీనిపై అధికారులు స్పందించాలని ప్రయాణికులు కోరుతున్నారు.