తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం వ్యవస్థాపకులు కామ్రేడ్ కాల్వ నరసయ్య యాదవ్ జయంతి ఈ రోజు ఘనంగా జరుపుకున్నారు.
ఈ కార్యక్రమం భీమారం మండల కేంద్రంలో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ కామ్రేడ్ కాల్వ నరసయ్య యాదవ్ గారి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
డాక్టర్ అశోక్ యాదవ్ కామ్రేడ్ కాల్వ నరసయ్య యాదవ్ చేసిన పోరాటం, త్యాగం మనందరికీ ఆదర్శంగా నిలుస్తుందని అన్నారు.
ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మెండే మల్లేష్ యాదవ్, మండల గౌరవ అధ్యక్షులు వేల్పుల పర్వతాలు యాదవ్, ప్రధాన కార్యదర్శి కేశవేణి సత్యనారాయణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
కామ్రేడ్ కాల్వ నరసయ్య యాదవ్ గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘాన్ని స్థాపించి, గొర్రెల కాపరులను సంఘటితపరిచి వారి హక్కుల కోసం పోరాడారు.












