అక్షరవేకువ (అక్షరవేకువ) జూలై 04
ూై2ీహంయడెంణషణేటీఅెటుధయషంటహెచఎంఎయయఅెటుహద,యయ,అెటుెడడశంశంచ.యషేెయ,ంేణయయడండచేశ.
తెలంగాణ రక్షణ సేన పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారిని హెచ్ఎంఎస్ నాయకులు రియాజ్ అహ్మద్, తిప్పారపు సారయ్య, వంటకాల అనిల్ రెడ్డి గార్లు శుక్రవారం సాయంత్రం పరామర్శించి యోగక్షేమాలు తెలుసుకున్నారు. జూలై 2వ తేదీన ఉద్యమకారులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలని పోరాటం నిర్వహిస్తున్న సమయంలో పోలీసుల హింసలో కవితక్క గాయపడిన విషయం తెలిసిందే.
ఈ సందర్భంగా హెచ్ఎంఎస్ నాయకులు మాట్లాడుతూ, కవితక్క గాయపడినప్పటికీ, ముందుగా నిర్ణయించుకున్న ప్రకారం కొత్తగూడెం రీజియన్ రెండవ దఫా బాయిబాట కార్యక్రమం 9, 10, 11 తేదీలలో యధావిధిగా కొనసాగుతుందని తెలిపారు. సింగరేణి యాజమాన్యం మెడికల్ బోర్డును పునరుద్ధరించి, బోర్డుకు దరఖాస్తు చేసుకున్న అందరినీ మెడికల్ అన్ ఫిట్ చేయాలని మొదటి విడత శ్రీరాంపూర్ బాయిబాటలో కోరినట్లు పేర్కొన్నారు. జూలై 20వ తేదీలోపు సింగరేణి యాజమాన్యం అధికారిక ప్రకటన చేయకుంటే నిరవధిక దీక్ష చేస్తానని హెచ్చరించారు.
కాబట్టి, జూలై 20వ తేదీలోపు సింగరేణి యాజమాన్యం స్పందించి మెడికల్ బోర్డును నిర్వహిస్తామని అధికారిక ప్రకటన చేయకుంటే నిరవధిక దీక్ష తప్పదని హెచ్చరించారు. ఈ సందర్భంగా యావత్ సింగరేణి కార్మిక వర్గం, మిత్ర కార్మిక సంఘాలన్నీ కవితక్క చేపట్టబోయే నిరవధిక దీక్షకు మద్దతు ప్రకటించాలని కోరారు.
ఇట్లు, రియాజ్ అహ్మద్, జనరల్ సెక్రెటరీ, హెచ్ఎంఎస్ తిప్పారపు సారయ్య, ప్రెసిడెంట్ అనిల్ రెడ్డి, శ్రీరాంపూర్ ఏరియా వైస్ ప్రెసిడెంట్.












