మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 12
మంచిర్యాల 39వ డివిజన్ పరిధిలోని దూస శంకరయ్య నాగదేవత కాలనీ, సూర్య నగర్ కాలనీ, రోడ్ నెం. 6లో సునీత ప్రభాకర్మారు 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిధుల ద్వారా ఈ పనులు చేపట్టారు.
మంచిర్యాల 39వ డివిజన్ పరిధిలోని దూస శంకరయ్య నాగదేవత కాలనీ, సూర్య నగర్ కాలనీ, రోడ్ నెం. 6లో సుమారు 10 లక్షల రూపాయల వ్యయంతో సీసీ డ్రైన్ నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. నిధుల ద్వారా ఈ పనులు చేపట్టారు.
ప్రజలకు మెరుగైన సౌకర్యం
గౌరవనీయులు, మంచిర్యాల శాసనసభ్యులు శ్రీ కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు గారి ప్రత్యేక చొరవతో ఈ పనులు చేపట్టినట్లు 39వ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి పూదరి సునీత ప్రభాకర్ తెలిపారు. ప్రజలకు మెరుగైన మురుగునీటి సౌకర్యం కల్పించడమే లక్ష్యమని, వర్షాకాలంలో నీరు నిలవడం, దోమల బెడద వంటి సమస్యలకు ఈ డ్రైన్ పరిష్కారం చూపుతుందని ఆమె అన్నారు.
అభివృద్ధి పనులకు హామీ
ఈ సందర్భంగా స్థానిక నాయకులు, కాలనీ వాసులు పాల్గొని హర్షం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే గారి సహకారంతో డివిజన్ లో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామని కార్పొరేటర్ హామీ ఇచ్చారు.











