మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 19
మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తమ రక్షణతో పాటు చట్టానికి సహకరించేలా క్రమశిక్షణతో మెలగాలని వాహనదారులకు మంచిర్యాల ట్రాఫిక్ సీఐ ఎండి ఆనన్ సూచించారు. నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.

అండర్ బ్రిడ్జ్ వద్ద జాగ్రత్త
ముక్ర రామ్ చౌరస్తా వద్ద అండర్ బ్రిడ్జ్ వద్దకు వచ్చే వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలకు అనుగుణంగా, నెమ్మదిగా వెళ్లాలని సీఐ వెల్లడించారు. పట్టణంలో ప్రస్తుతం జరుగుతున్న నూతన డ్రైనేజీ, విద్యుత్ ఆధునికరణ పనుల కారణంగా ట్రాఫిక్కు కొంత అంతరాయం కలుగుతోందని, దీనిని దృష్టిలో ఉంచుకొని రక్షణ చర్యలు, ఏర్పాట్లు ఎప్పటికప్పుడు తీసుకుంటున్నామని ఆయన పేర్కొన్నారు.
ప్రమాదకర స్పీడుపై ఆంక్షలు
మార్కెట్ ఏరియా, స్టేషన్ రోడ్లలో అతివేగంతో వాహనాలు నడపరాదని, అలా చేయడం ప్రమాదాలకు దారితీస్తుందని సీఐ స్పష్టం చేశారు. లైసెన్స్, ట్రిపుల్ రైడింగ్, ఆర్సీ (రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్) లేనివారు వాహనాలు నడిపితే వాటిని అదుపులోకి తీసుకుంటామని చెప్పారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కేసు నమోదు చేసి, జరిమానా విధించడం జరుగుతుందని తెలిపారు.
నిరంతర తనిఖీలు
పట్టణంలో రోజు రెండు ప్రాంతాలుగా పోలీసుల తనిఖీలు కొనసాగుతాయని సీఐ తెలిపారు. వాహనదారులు పోలీసులకు సహకరించాలని, లేనిపక్షంలో చట్టపరమైన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు.