మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 30
ది అఖిల్ భారతీయ విశ్వకర్మ మహాసభ - తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధిగా బ్రహ్మశ్రీ మియాపురం లక్ష్మణ్ చారిని నియమించారు. ఈ నియామక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి గారి అధ్యక్షతన, జిల్లా నాయకుల సమక్షంలో నిర్వహించారు.
ది అఖిల్ భారతీయ విశ్వకర్మ మహాసభ - తెలంగాణ ఆధ్వర్యంలో మంచిర్యాల జిల్లా అధికార ప్రతినిధిగా బ్రహ్మశ్రీ మియాపురం లక్ష్మణ్ చారిని నియమించారు. ఈ నియామక ప్రక్రియను తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి గారి అధ్యక్షతన, మంచిర్యాల జిల్లా అధ్యక్షులు బ్రహ్మశ్రీ కోటోజు రమేష్ చారి, ప్రధాన కార్యదర్శి బ్రహ్మశ్రీ గుండోజు రమేష్ చారి, కోశాధికారి బ్రహ్మశ్రీ పండురు రమణాచారి గార్ల సమక్షంలో నిర్వహించారు.
సంఘ బలోపేతానికి కృషి
ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు నౌండ్ల సంతోష్ చారి మాట్లాడుతూ, విశ్వబ్రాహ్మణ సమాజం కోసం సేవ చేయాలనే సంకల్పంతో పనిచేస్తున్న యువతను, సీనియర్ నాయకులను, మేధావులను సంఘం గుర్తించి, వారి సేవలు మరియు సామర్థ్యాలకు అనుగుణంగా భవిష్యత్తులో సముచిత స్థానం, బాధ్యతలు కల్పిస్తామని తెలిపారు. విశ్వకర్మ సమాజ అభివృద్ధి, ఐక్యత, సంక్షేమం కోసం ప్రతి ఒక్కరూ సమష్టిగా కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు.
నూతనంగా ఎంపికైన జిల్లా కమిటీ సభ్యులకు పలువురు సంఘ నాయకులు, విశ్వకర్మ ప్రముఖులు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.









