స్వర్గీయ మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి (కాకా) కళావతమ్మ జ్ఞాపకార్థం అఖిల భారత యాదవ మహా సభ ఆధ్వర్యంలో మందమర్రిలో ఉచిత పెరుగన్నం, మజ్జిగ, త్రాగునీటి పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా అధ్యక్షుడు బండి సదానందం యాదవ్ అధ్యక్షత వహించారు.
ఈ సందర్భంగా బండి సదానందం యాదవ్ మాట్లాడుతూ, కాకా వెంకటస్వామి నిరుపేదల సంక్షేమానికి, తెలంగాణ ఉద్యమానికి చేసిన సేవలను కొనియాడారు. సింగరేణి కార్మికులకు పెన్షన్ పథకం, ఉద్యోగ భద్రత కల్పించడంలో ఆయన పాత్ర కీలకమని తెలిపారు.
కాకా కుటుంబం, ముఖ్యంగా ఆయన కుమారుడు, మంత్రి వివేక్ వెంకటస్వామి, మనవడు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ, కాకా ఆశయాలను కొనసాగిస్తూ ప్రజలకు సేవ చేస్తున్నారని పేర్కొన్నారు. విశాఖ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా జరుగుతున్న సేవా కార్యక్రమాలను ప్రశంసించారు.
తన వంతుగా పేదలకు సేవ చేసే అవకాశం లభించడం అదృష్టంగా భావిస్తున్నానని బండి సదానందం యాదవ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు యాదవ సంఘం నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.








