పెద్దపల్లి, 2026-06-05
ఒకప్పుడు ఆడపిల్ల పుడుతుందని తెలిసి గర్భంలోనే అంతం చేయాలనుకున్న సమాజమే, నేడు పెళ్లి వయసు వచ్చేసరికి అమ్మాయి దొరకడం లేదని అల్లాడిపోతోంది. జాతీయ మానవత వెలుగు అవార్డు గ్రహీత దార మధు ఈ ద్వంద్వ వైఖరిని తీవ్రంగా ఖండించారు.
ఒకప్పుడు ఆడపిల్ల పుడుతుందని తెలిసి గర్భంలోనే అంతం చేయాలనుకున్న సమాజమే, నేడు పెళ్లి వయసు వచ్చేసరికి అమ్మాయి దొరకడం లేదని అల్లాడిపోతోంది. ఒకప్పుడు ఆడపిల్ల పుట్టడం భారంగా భావించిన సమాజమే, నేడు అదే ఆడపిల్ల కోసం పెళ్లి సంబంధాల వెంట పరుగులు తీస్తోంది. ఆడపిల్లను కూతురిగా వద్దనుకున్నవారికి, అదే ఆడపిల్ల రేపు భార్యగా కావాలనే ఆలోచన ఎంతటి విరుద్ధమైన మనస్తత్వమో ఆలోచించాల్సిన సమయం ఆసన్నమైంది.
కూతురిగా వద్దు... కోడలిగా మాత్రం కావాలి... అనే ద్వంద్వ వైఖరి సమాజంలో ఇంకా కొనసాగుతుండటం సిగ్గుచేటు. ఇంట్లో ఆడపిల్ల పుడితే ఖర్చు, బాధ్యత, కట్నం అంటూ భారంగా చూసే కొందరు, తమ కొడుకుకు పెళ్లి చేయాల్సి వస్తే మాత్రం మంచి చదువు, ఉద్యోగం, అందం, ఆస్తి ఉన్న అమ్మాయి కావాలని షరతులు పెడుతున్నారు. తాము ఆడపిల్లను పెంచేందుకు వెనుకాడుతూ, మరొకరి ఇంటి ఆడపిల్ల తమ ఇంటికి కోడలిగా రావాలని కోరుకోవడం ఎంతవరకు సమంజసం
ఆడపిల్లలను గర్భంలోనే అంతం చేస్తే రేపటి తరానికి భార్యలు ఎలా దొరుకుతారు కూతుళ్లను కాపాడకుండా, వారి జననాన్ని అడ్డుకుంటూ పోతే పెళ్లి చేసుకునే అమ్మాయిల సంఖ్య తగ్గిపోవడం ఖాయం. ఇది ఎవరో ఒకరికి ఎదురయ్యే సమస్య కాదు... సమాజం మొత్తం ఎదుర్కోవాల్సిన ప్రమాదం. ఆడపిల్లను పుట్టనివ్వకుండా చేసిన ప్రతి వివక్షకు భవిష్యత్తులో సమాజమే మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది.
కర్మ తిరిగి వస్తుంది అన్న మాట ఇక్కడ అక్షరాలా నిజమనిపిస్తోంది. కూతురిగా వద్దనుకున్న ఆడపిల్లే ఒకరోజు కోడలిగా అవసరమవుతోంది. మన ఇంట్లో పుట్టే ఆడపిల్లను భారంగా కాకుండా భవిష్యత్తు తరానికి బలమైన పునాదిగా చూడాలి. కూతురు అంటే ఖర్చు కాదు... కుటుంబానికి వెలుగురేఖ. ఆడపిల్ల అంటే బాధ్యత కాదు... సమాజానికి భవిష్యత్ వారధి.
ఆడపిల్ల పుట్టడాన్ని ఆపేసి, ఆడపిల్ల కోసం వెతికే పరిస్థితి రావడం మన సమాజపు తప్పిదాలకు అద్దం పడుతుంది. కూతురిని కాపాడని కుటుంబం, కోడలిని కోరుకునే హక్కును ఎలా కోల్పోతుంది ఆడపిల్లను కూతురిగా గౌరవించినప్పుడే, ఆమెను భార్యగా గౌరవించే సంస్కారం సమాజంలో నిలుస్తుంది. కూతురిగా వద్దు... భార్యగా కావాలి అనే ద్వంద్వ ధోరణికి స్వస్తి చెప్పి, ప్రతి ఆడపిల్లను పుట్టనివ్వాలి, చదివించాలి, ఎదగనివ్వాలి, గౌరవించాలి. అప్పుడే సమాజం నిజమైన అర్థంలో అభివృద్ధి చెందినదిగా చెప్పుకునే అర్హత పొందుతుంది.
జాతీయ మానవత వెలుగు అవార్డు గ్రహీత దార మధు ఈ విషయాలను తెలిపారు. ఆయన ఫోన్ నంబర్ 7396021499.












