జిన్నారం, 2026-08-13
పీఆర్సీ అమలుతో పాటు ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జిన్నారం తహసీల్దార్ ఆంథోనికి యుఎస్ పీసీ స్టీరింగ్ కమిటీ సభ్యులు కొండయ్య ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు వినతి పత్రం అందజేశారు. గురువారం తహసీల్దార్ కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది.

ఉద్యోగ, ఉపాధ్యాయులకు పీఆర్సీ అమలు చేయడం, ఆరోగ్య కార్డులు మంజూరు చేయడం, మోడల్ స్కూల్ వ్యవస్థను పాఠశాల విద్యలో విలీనం చేయడం, పెండింగ్ బిల్లులను వెంటనే మంజూరు చేయడం, న్యాయమైన వేతన సవరణ చేపట్టడం వంటి డిమాండ్లను వెంటనే నెరవేర్చాలని ఉపాధ్యాయ సంఘాల నాయకులు తహసీల్దార్ ను కోరారు.
ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు కేశవరావు, రామచందర్, అమరేశ్వరి, ఆనందం, విశాలాక్ష్మి, నాయక్ తో పాటు పలువురు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.