ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ రాష్ట్ర శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఒక సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. మధుసూదన్ రెడ్డి, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రొఫెసర్ సి. రాములును కలిసి, మంచిర్యాలలోని రక్తనిధి కేంద్ర నిర్మాణానికి సహకారం కోరారు.
రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వి. మధుసూదన్ రెడ్డి, రెడ్ క్రాస్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రొఫెసర్ సి. రాములును మర్యాదపూర్వకంగా కలిసి, ఆయనను శాలువాతో సత్కరించారు.
మంచిర్యాలలో రెడ్ క్రాస్ రక్తనిధి కేంద్రం కోసం నూతనంగా నిర్మిస్తున్న భవనం నిర్మాణ పురోగతిపై కార్యదర్శికి వివరించారు.
నూతన భవన నిర్మాణానికి రెడ్ క్రాస్ రాష్ట్ర అధ్యక్షులు, రాష్ట్ర గవర్నర్ మరియు చైర్మన్ గారి నుండి సహాయ సహకారాలు అందించాలని వి. మధుసూదన్ రెడ్డి కోరారు.
ఈ అభ్యర్థనకు కార్యదర్శి డాక్టర్ ప్రొఫెసర్ సి. రాములు సానుకూల స్పందన తెలిపినట్లు తెలిసింది.












