సంగారెడ్డి, 2026-08-20
సంగారెడ్డి పట్టణంలో పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డైరెక్టర్ నవీన్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఆయన స్నేహితులు, సహచరులు, విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.
సంగారెడ్డి పట్టణంలోని పద్మావతి కాలేజ్ ఆఫ్ నర్సింగ్ డైరెక్టర్ నవీన్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆయన స్నేహితులు, సహచరులు ఆయనకు శాలువా కప్పి సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఒక కళాశాలను స్థాపించి వందలాది మంది విద్యార్థులకు నర్సింగ్ విద్యను బోధించడంలో ఆయన చేస్తున్న కృషిని అభినందించారు. జీవితంలో స్థిరపడేందుకు దోహదపడుతున్నందుకు ఆయన పట్ల కృతజ్ఞత వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో తిరుమల్, మాణిక్ ప్రభు మందిరం కమిటీ అధ్యక్షుడు ఆమెటి కిట్టు, మల్లికార్జునగౌడ్, శ్రీనివాస్, కృష్ణ, శ్రీహరి ప్రవీణ్, సునీల్, రాహుల్, కార్తీక్, నరేష్, కళాశాల విద్యార్థులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.









