సంగారెడ్డి, 2024-08-20
సంగారెడ్డి మండలం ఇస్మాల్ ఖాన్పేట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీవో శ్రీకాంత్ గురువారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులతో పాటు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును ఆయన పరిశీలించారు.
సంగారెడ్డి మండలం ఇస్మాల్ ఖాన్పేట గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ఎంపీవో శ్రీకాంత్ గురువారం తనిఖీ చేశారు. కార్యాలయంలోని రికార్డులు, పారిశుద్ధ్య నిర్వహణ, గ్రామ అభివృద్ధి కార్యక్రమాల అమలు తీరును ఆయన పరిశీలించారు. అనంతరం గ్రామంలోని వర్మీకంపోస్టు యూనిట్, నర్సరీ, వైకుంఠధామాన్ని సందర్శించి అక్కడి నిర్వహణను పరిశీలించారు.
ఈ సందర్భంగా ఎంపీవో శ్రీకాంత్ మాట్లాడుతూ గ్రామంలో పారిశుద్ధ్య నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. నర్సరీలో మొక్కల సంరక్షణపై నిరంతరం దృష్టి సారించాలని, గ్రామంలో పచ్చదనం పెంపొందించేలా చర్యలు చేపట్టాలని తెలిపారు. వైకుంఠధామంలో అవసరమైన వసతులు, పరిశుభ్రతను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సిబ్బందిని ఆదేశించారు.
ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రటరీ సునీత, సిబ్బంది పాల్గొన్నారు.









