హుస్సూర్ (అక్షరవేకువ) ఆగస్టు 29
తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ కు సామాజిక సేవ రంగంలో గౌర ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లభించింది. ఈ పురస్కారాన్ని తమిళనాడులోని హుస్సూర్ పట్టణంలో అమెరికన్ విస్డం పీస్ యూనివర్సిటీ ప్రతినిధులు అందజేశారు.
మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని కాజీపెళ్లి గ్రామానికి చెందిన కొమ్ము అశోక్ యాదవ్ తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ కు సామాజిక సేవ రంగంలో గౌర ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లభించింది. ఈ అవార్డును తమిళనాడులోని హుస్సూర్ పట్టణంలో అమెరికన్ విస్డం పీస్ యూనివర్సిటీ సీఈవో డాక్టర్ ఎల్జిబిత్ థామస్, ప్రొప్రైటర్ జాన్ విల్సన్ ఆధ్వర్యంలో ఆయన అందుకున్నారు.
అంతర్జాతీయ గుర్తింపు
అమెరికన్ పీస్ యూనివర్సిటీ, గౌర ఇంటర్నేషనల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ సంయుక్తంగా ఈ పురస్కారాన్ని అందజేశాయి. తెలంగాణ గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం తరపున డాక్టర్ కొమ్ము అశోక్ యాదవ్ చేసిన సేవలకు గాను ఈ గుర్తింపు లభించింది. ఈ కార్యక్రమంలో గాలి మధు యాదవ్, అరుణ్ కుమార్, శ్రీరామ్ కరుణాకర్ స్వామి మరియు పలువురు నాయకులు పాల్గొన్నారు.









