మంచిర్యాల జిల్లా భీమారం మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర గొర్రెల మేకల పెంపకం వృత్తిదారుల సంఘం ఆధ్వర్యంలో వీరనారి బెల్లి లలితక్క వర్ధంతి సందర్భంగా ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా సంఘం నాయకులు డాక్టర్ అశోక్ యాదవ్ మాట్లాడుతూ, తెలంగాణ ఉద్యమానికి ఊపిరి పోసిన బెల్లి లలితక్క గారి పోరాట స్ఫూర్తి అందరికీ ఆదర్శమని అన్నారు. ఆమె ఆశయాల సాధన కోసం, బడుగు బలహీన వర్గాల హక్కుల కోసం నిరంతరం పోరాడాలని పిలుపునిచ్చారు. మహనీయుల విగ్రహాలతో పాటు బెల్లి లలితక్క, దొడ్డి కొమురయ్య విగ్రహాలను ట్యాంక్ బండ్పై స్థాపించాలని, ఆమె జయంతి, వర్ధంతి కార్యక్రమాలను ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలని ఆయన కోరారు.
బెల్లి లలితక్క లాంటి త్యాగమూర్తుల వల్లే నేడు తెలంగాణ సాధ్యమైందని, ఆమె కలలు కన్న బంగారు తెలంగాణ కోసం గొర్రెల కాపరులు, యాదవులు ఐక్యంగా ఉద్యమించాలని జిల్లా అధ్యక్షులు చిల్లారపు సంతోష్ యాదవ్ అన్నారు.
ఈ కార్యక్రమంలో మండల సంఘం నాయకులు, సభ్యులు, యువకులు పెద్ద ఎత్తున పాల్గొని లలితక్కకు జోహార్లు అర్పించారు. నియోజకవర్గ, మండల స్థాయి నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.











