మంచిర్యాల (అక్షరవేకువ) ఆగస్టు 02
మంచిర్యాల డివిజన్లో గత నాలుగు రోజులుగా తాగునీటి సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులు కుంటి సాకులు చెబుతూ నీటి సరఫరాను దాటవేస్తున్నారని, గతంలో వేసవిలో మాదిరిగానే వర్షాకాలంలోనూ ఇదే వైఖరి కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఎందుకు చేయడం లేదని ప్రశ్నిస్తున్నారు.

బిజెపి నాయకుల డిమాండ్
ఈ తాగునీటి సమస్యపై బిజెపి కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ ముఖేష్ గౌడ్ తో పాటు కార్పొరేటర్లు కస్తూరి నాగరాజు, బోట్ల అనిత, సత్యం కలిసి గోదావరి నదిని పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ, ప్రజల కష్టాలు పాలకవర్గానికి పట్టడం లేదని విమర్శించారు. వెంటనే ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేపట్టాలని, పైపులైన్లకు మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వంపై అసహనం
నాలుగు రోజులుగా డివిజన్లో మహిళలు, పేదవాళ్లు తాగునీటి కోసం పడుతున్న ఇబ్బందులపై ప్రభుత్వ పాలనపై తీవ్ర అసహనాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సమస్యలు పట్టని ప్రభుత్వాలకు ప్రజలు చరమగీతం పాడే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు. అధికారులు చిత్తశుద్ధితో నీటి సరఫరాపై దృష్టి పెట్టాలని సూచించారు.