మందమర్రి పట్టణంలో భారత జనగణన – 2027 కార్యక్రమంలో భాగంగా సోమవారం ఇంటింటికీ వెళ్లి ఇండ్ల జాబితా, గృహ గణన సమాచార సేకరణ కార్యక్రమం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ జూన్ 9 వరకు కొనసాగనుంది.
మందమర్రి మున్సిపల్ కమిషనర్ టి. రాజ లింగు వార్డు నెం. 19 లో ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. పట్టణంలోని 24 వార్డులలో 75 మంది ఎన్యూమరేటర్లు, 13 మంది సూపర్వైజర్లు ఈ సమాచార సేకరణలో పాల్గొంటున్నారు. వీరందరూ అధికారిక గుర్తింపు కార్డులను కలిగి ఉంటారని, ప్రజలు వాటిని పరిశీలించి సహకరించాలని కమిషనర్ కోరారు.
ఈ సందర్భంగా రెవెన్యూ అధికారి పి. కృష్ణ ప్రసాద్, సూపర్వైజర్ ఎన్. సదయ్య, ఎన్యూమరేటర్ ఏ. వెంకట రాజమ్మ, వార్డు అధికారి ఎస్. రాజేశ్వర్ రావ్ మరియు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. జనగణన సిబ్బంది కేవలం నిర్దేశిత ప్రశ్నలకు మాత్రమే సమాధానాలు అడుగుతారని, వ్యక్తిగత, రహస్య సమాచారాన్ని కోరరని అధికారులు తెలిపారు.
ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారిక సిబ్బందికి మాత్రమే సమాచారాన్ని అందించాలని సూచించారు. OTPలు, బ్యాంకు ఖాతా వివరాలు వంటివి ఎట్టి పరిస్థితుల్లోనూ అడగరని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సేకరించిన గణాంకాలు ప్రభుత్వ ప్రణాళికలకు ఉపయోగపడతాయి.












