సంగారెడ్డి, 2026-08-24
నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారంలో అసోసియేషన్ కీలక పాత్ర పోషించాలని ఎస్పీ సూచించారు.
నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు సోమవారం జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ ను మర్యాదపూర్వకంగా కలిసి, పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది సంక్షేమం, వారి సమస్యల పరిష్కారంలో పోలీస్ అసోసియేషన్ కీలక పాత్ర పోషించాలని సూచించారు.
ముఖ్యంగా పోలీస్ సాలరీ ప్యాకేజ్, ఆరోగ్య భద్రత, సిబ్బంది సంక్షేమానికి సంబంధించిన ఇతర అంశాలపై నిరంతరం దృష్టి సారించి, సిబ్బందికి అవసరమైన సహాయ సహకారాలు అందేలా కృషి చేయాలని ఎస్పీ తెలిపారు. పోలీస్ సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేయాలని ఆయన సూచించారు.
పోలీస్ సిబ్బంది సంక్షేమం, వృత్తిపరమైన సమస్యల పరిష్కారానికి జిల్లా పోలీస్ శాఖ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని ఎస్పీ పరితోష్ పంకజ్ హామీ ఇచ్చారు. సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వడం తమ బాధ్యత అని, ఈ విషయంలో అసోసియేషన్ తో కలిసి పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎ. జనార్ధన్ మాట్లాడుతూ, పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం అసోసియేషన్ సభ్యులు అహర్నిశలు కృషి చేస్తామని తెలిపారు. సిబ్బంది సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకుని, వాటి పరిష్కారానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారుల సూచనలు, ఆదేశాలకు అనుగుణంగా నడుచుకుంటూ పోలీస్ సిబ్బంది సంక్షేమం కోసం సమన్వయంతో పనిచేస్తామని జనార్ధన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో నూతనంగా ఎన్నికైన జిల్లా పోలీస్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎ. జనార్ధన్, హెడ్ కానిస్టేబుల్ జిల్లా పోలీస్ అసోసియేషన్ అధ్యక్షులు, బి. రమేష్, ఇన్స్పెక్టర్ ఉపాధ్యక్షుడు, రాజశేఖర్ రెడ్డి, ఆర్ఐ ఎం.రాజారామ్, జి. సంతోష్ కుమార్, కూన రమేష్, అబ్దుల్ కరీమ్, టి. వెంకటేశం, జి. శ్రీనివాస్ పి. అరుణ కుమారి, అంగోథ్ రమేష్, ముజామిల్ తదితరులు ఉన్నారు.












